VIDEO: హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం
MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం హనుమాన్ నామస్మరణతో మారుమోగింది. మాలధారణ చేసిన భక్తులు 108 సార్లు హనుమాన్ చాలీసాను సామూహికంగా పారాయణం చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భజనలు, భక్తి గీతాల మధ్య సాగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.