VIDEO:హుజూర్‌నగర్‌లో నకిలీ సబ్బులు, నూనె కలకలం..!
SRPT: హుజూర్ నగర్ పట్టణంలో నకిలీ ఉత్పత్తుల కలకలం రేగింది. ప్రముఖ బ్రాండ్‌లను అయిన పారాచూట్ కొబ్బరినూనె, మైసూర్ శాండిల్ సబ్బుల పేరుతో నకిలీ వస్తువులను విక్రయిస్తుండగా స్థానిక డిస్ట్రిబ్యూటర్లు పట్టుకున్నారు. అసలైన బ్రాండ్‌లను ప్యాకింగ్‌ను పోలి ఉన్న వీటిని గుర్తించి విక్రయదారులను నిలదీశారు. నకిలీ వస్తువులతో మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.