'రాజీయే రాజా మార్గం'

JGL: రాజీయే రాజా మార్గమని జగిత్యాల ప్రధాన న్యాయమూర్తి రత్న తెలిపారు. శనివారం జగిత్యాల జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్ రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా విడిపోయిన జంటను పూలదండలు మార్పిడి చేయించి తిరిగి కలిపారు.