అదృష్టవంతుడు.. బంగారం గెలుచుకున్నాడు
దుబాయ్‌లో కేరళకు చెందిన నితిన్ కున్నత్ రాజ్‌కు అదృష్టం వరించింది. బిగ్ టికెట్ ఈ-డ్రాలో జాక్‌పాట్ తగిలింది. తన ఫ్రెండ్స్‌తో కలిసి కొన్న టికెట్‌పై 250 గ్రాముల బంగారం(24 క్యారెట్ల గోల్డ్ బార్) గెలుచుకున్నాడు. దీని విలువ దాదాపు రూ.30 లక్షల వరకు ఉంటుంది. దీనిపై నితిన్ హర్షం వ్యక్తం చేశాడు.