"సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలపాలి"

NLG: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత విలేకరులపై ఉందని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. దేవరకొండ పట్టణంలో ప్రెస్ సంఘం భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.