ఆర్టీసీ బస్టాండ్‌ను తనిఖీ చేసిన రీజనల్ మేనేజర్

ప్రకాశం: మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్‌ను శనివారం రీజనల్ మేనేజర్ సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు పథకం గురించి మహిళలతో మాట్లాడి ఆయన తెలుసుకున్నారు. అనంతరం బస్టాండ్ పరిసరాలను పరిశీలించారు. మహిళలు ప్రయాణించుటకు ఇబ్బందులు లేకుండా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.