మెగాస్టార్ 'కొదమ సింహం' రీరిలీజ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'కొదమ సింహం' సినిమా రీరిలీజ్ కానుంది. ఈనెల 21న 4K వెర్షన్, కొత్త డిజిటల్ సౌండ్‌తో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 1990లో విడుదలైన ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది. తాజాగా ఈ సినిమా 4K ట్రైలర్‌ను చిరంజీవి విడుదల చేశారు.