అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
కృష్ణా: పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలో పీఎంఏవై, ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ బుధవారం పరిశీలించారు. కాలనీలో రహదారులు,డ్రైనేజ్ వ్యవస్థ, త్రాగునీటి సదుపాయం విద్యుత్ ఏర్పాటు తదితర పనులను ఎమ్మెల్యే పరిశీలించి అధికారులకు సూచనలు అందించారు. గృహ నిర్మాణాలను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.