రామాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న జడ్పీ ఛైర్మన్
VZM: ఎల్.కోట మండలం రొంగలవానిపాలెం గ్రామంలో రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఇలాంటి దేవాలయాలు కేంద్రబిందువులుగా నిలుస్తాయని పేర్కొన్నారు.