నర్సంపేట, వర్ధన్నపేటకు ప్రత్యేకాధికారి నియామకం

వరంగల్: జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట పురపాలికల పాలకవర్గం పదవీకాలం ఆదివారం నాటికి ముగిసింది. దీంతో ఎన్నికల వరకు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది. దీంతో రెండు మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంధ్యారాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.