శ్రీశైలం దేవస్థానంలో భద్రత కట్టుదిట్టం

AP: శ్రీశైలం దేవస్థానంలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని ఈవో శ్రీనివాసరావు భద్రతా విభాగాన్ని ఆదేశించారు. ఇందుకోసం పోలీసుశాఖ సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. దేవస్థానం టోల్ గేట్ వద్ద వాహనాలను, అనుమానితులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. క్యూకాంప్లెక్స్, ప్రధాన ఆలయం, క్షేత్ర పరిధిలో, సాక్షి గణపతి వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండాలని ఈవో ఆదేశించారు.