ఇందుపూర్‌లో రెవెన్యూ గ్రామసభ
NLR: అల్లూరు మండలంలోని ఇందుపూరు గ్రామంలో మంగళవారం రెవెన్యూ గ్రామసభను అధికారులు ఏర్పాటు చేశారు. రెవెన్యూ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారి దగ్గర నుండి అధికారులు అర్జీలను స్వీకరించారు. దాదాపుగా మొత్తం 17 మంది అర్జీలు ఇచ్చినట్లు తహసిల్దార్ లక్ష్మీనారాయణ తెలియజేశారు. రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.