రాష్ట్ర అధికార ప్రతినిధిగా జాడీ రామరాజు

MLG: బీజేపీ దళిత మొర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన జాడి రామరాజు నియమితులయ్యారు. ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ నియామక పత్రాన్ని అందజేశారు. రామరాజు మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, జిల్లాలో పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా కష్టపడి పని చేస్తానన్నారు.