పేకాట శిబిరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్

పేకాట శిబిరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం చంద్రాల గ్రామంలో రహస్యంగా పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పేకాట శిబిరంపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. రహస్యంగా పేకాట ఆడుతున్న ఐదుగురు అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుంచి రూ.1,250 నగదు స్వాధీనం చేసుకొని,కేసు నమోదు చేశారు. చట్టం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.