VIDEO: 'విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయండి'
KMM: పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల విడుదలకై ఈనెల 26న చేపట్టే విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని PDSU జిల్లా అధ్యక్షుడు గోకినపల్లి మస్తాన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇవాళ ఖమ్మంలోని కాకతీయ వర్సిటీ పీజీ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు.