VIDEO: మానసా దేవి ఆలయంలో భక్తుల రద్దీ

KNR: గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ మానసా దేవి ఆలయంలో చివరి శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది . ఈ సందర్భంగా అపురూప లక్ష్మి, మానసా దేవి అమ్మవారికి వట్టివేర్లతో అలంకరణ, పసుపు గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు 108 జంట నాగ శివలింగాలకు నీటితో అభిషేకం చేసి, ఓడి బియ్యం పోసి, ముడుపులు కట్టారు.