VIDEO: డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు

VIDEO: డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు

కృష్ణా: పామర్రు డంపింగ్ యార్డులో ఆదివారం అర్ధరాత్రి భారీగా మంటలు చెలరేగడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఎవరో కావాలనే అర్ధరాత్రి వేళల్లో మంటలు పెడుతున్నారని, గాలికి అవి వేగంగా వ్యాపిస్తూ తమ ప్రాణాలకు, ఆరోగ్యానికి ముప్పు తెస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. దట్టమైన పొగతో ఊపిరి తీసుకోవడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.