VIDEO: ఓటు హక్కు వినియోగించుకోండి అంటూ.. ముగ్గుతో సందేశం
KMR: మద్నూర్ మండల కేంద్రానికి చెందిన వడ్డేవార్ ధనశ్రీ ఇవాళ జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని, 'ఓటు ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకోండి' అంటూ ముగ్గు వేసి మంచి సందేశం ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమైందని పేర్కొన్నారు. ఈ ముగ్గు చూసిన వారు బాగుందని పేర్కొంటూ చిన్నారి ధనశ్రీని అభినందించారు.