ఇటుకలబట్టిలో వలస కూలీ మృతి

ఇటుకలబట్టిలో వలస కూలీ మృతి

MBNR: వలస కూలీ ఇటుకలబట్టిలో మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలంలో జరిగింది. ఎస్సై లెనిన్ వివరాలు.. మండలంలోని నేలబండ తండా సమీపంలో ఒడిస్సా రాష్ట్రంకు చెందిన త్రినాథ్ బోయి(55) గత 5 నెలలుగా ఇటుకలబట్టిలో పనిచేస్తున్నాడు. త్రినాథ్ గుండె నొప్పి బాధపడుతున్నాడని రాజు అనే వ్యక్తి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడు. గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.