పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్
కృష్ణా: తోట్లవల్లూరు మండలం వల్లూరిపాలెం గ్రామంలో కృష్ణానది ఒడ్డున పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పేకాట శిబిరంపై పోలీసులు నిన్న దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.13,900 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.