నీట మునిగిన బీసీ వసతి గృహం

MBNR: రాత్రి కురిసిన భారీ వర్షానికి బాలానగర్ మండలంలోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న బీసీ హాస్టల్లోకి వరద నీరు చేరింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. SI లెనిన్, పంచాయతీ కార్యదర్శి జగన్ నాయక్ హాస్టల్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.