కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
JGL: ప్రముఖ పుణ్యక్షేత్రం మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కొండకు తరలివస్తున్నారు. హనుమాన్ దీక్షలు చేపట్టిన స్వాములు అంజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొండగట్టు అంజన్న మమ్ములను సల్లంగా చూడు స్వామి అని భక్తులు వేడుకుంటున్నారు.