సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శిగా చిన్న తిరుపతయ్య

GNTR: సీపీఐ గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శిగా మంగళగిరికి చెందిన చిన్ని తిరుపతయ్య సోమవారం ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజల హక్కులను కాపాడుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. దేశ ప్రజల సంక్షేమానికి విరుద్ధంగా, కార్పొరేట్ అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఖండించారు.