మూడో టీ20కి సారా.. గిల్ కోసమేనా?

మూడో టీ20కి సారా.. గిల్ కోసమేనా?

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్, భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌కు హాజరైంది. యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో ఆమె ప్రేమాయణం నడుపుతున్నట్లు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ మ్యాచ్‌కు హాజరుకావడం, వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే ఊహగానాలకు మరింత బలం చేకూరింది.