నేటి నుంచి జేఈఈ, నీట్, ఈఏపీ సెట్‌కు ఉచిత శిక్షణ

నేటి నుంచి జేఈఈ, నీట్, ఈఏపీ సెట్‌కు ఉచిత శిక్షణ

VZM: ఆదర్శ పాఠశాలల్లో ప్రతిభ గల విద్యార్థులకు నేటి నుంచి జేఈఈ, నీట్, ఈఏపీ సెట్‌కు ఉచిత శిక్షణ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో జోన్-1 పరిధిలోని డెంకాడ(బాలికలు), శ్రీకాకుళం జిల్లా తామాడ(బాలురు), రణస్థలం(బాలికలు) ఆదర్శ పాఠశాలల్లో తరగతులు జరగను న్నాయి. ఆన్‌లైన్‌ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపికైన వారికి 30 రోజులు శిక్షణ ఇస్తామని డీఈవో యు. మాణిక్యం నాయుడు చెప్పారు.