బయ్యనగూడెం పీహెచ్‌సీకి ఆధునిక సామాగ్రి పంపిణీ

ELR: బయ్యనగూడెం పీహెచ్‌సీకి ఆధునిక సాంకేతిక సామాగ్రిని గురువారం జంగారెడ్డిగూడెంకి చెందిన నవభారత పామాయిల్ కంపెనీ సంస్థ ప్రతినిధులు అందజేశారు. ఏజెన్సీ మెట్ట ప్రాంతంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు సాంకేతిక పరికరాలను అందజేసే పథకంలో భాగంగా బయ్యనగూడెం ఆస్పత్రికి కూడా అందజేసినట్లు తెలిపారు. సుమారు మూడు లక్షల రూపాయల విలువైన పరికరాలను వైద్యాధికారులకు అందించారు.