'నిర్ణీత గడువులోగా పన్నులు చెల్లించాలి'
PLD: పిడుగురాళ్ల మున్సిపల్ పరిధిలోని ఇంటి యజమానులు ఈనెల 15వ తేదీలోపు 100% శాతం ఇంటి పన్ను చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆదేశించారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అయన కోరారు.