గార్లలో యువతి అదృశ్యం.. కేసు నమోదు

MHBD: గార్ల మండలం గుంపెళ్ళగూడెం గ్రామానికి చెందిన ఎద్దు హర్షిత అనే యువతి ఈనెల 10వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్యమైంది. ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఇవాళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.