VIDEO: కూలిన వృక్షం.. వాహనాలు ధ్వంసం
GDWL: గద్వాల పట్టణంలోని పంచాయతీరాజ్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఓ మహా వృక్షం శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే చెట్టు కింద పార్క్ చేసిన రెండు బైకులు, రెండు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.