ఆకట్టుకున్న గిరిజన విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిషన్
ASR: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గుమ్మకోట పంచాయతీ తుమ్మలవలసలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్(బాయ్స్)లో విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. విద్యార్థులు తమ మెదడుకు పదునుపెట్టి పలు వినూత్న ప్రయోగాలు ప్రదర్శించారు. ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సియ్యారి దొన్ను దొర ఈ ప్రదర్శనను వీక్షించి, విద్యార్థులను అభినందించారు.