జిల్లాలో పసికందు వదిలేసిన ఘటన కలకలం

జిల్లాలో పసికందు వదిలేసిన ఘటన కలకలం

GNTR: పొన్నూరు(M) పచ్చలతాడిపర్రులో శనివారం చోటుచేసుకున్న ఘటన స్థానికులను కలిచివేసింది. గ్రామ శివారులోని పొలాల్లో ఒక్కరోజు పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. శిశువు రోదన వినిపించడంతో అప్రమత్తమైన రైతులు అక్కడికి చేరుకుని, పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు విచారణ ప్రారంభించారు.