విగ్రహాల పరిరక్షణకు పోలీసు వారి సూచనలు
ELR: నూజివీడు మండలం యనమదల, రేగుంట, బోర్వంచ, సుంకొల్లు, బత్తుల వారి గూడెం గ్రామాలలో ఉన్న విగ్రహాల పరిరక్షణకు కమిటీల వారు చర్యలు చేపట్టాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు ఆయా గ్రామాలలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ కమిటీ సభ్యులకు రూరల్ ఎస్సైలు జ్యోతి బసు, లక్ష్మణ్ బాబులు నోటీసుల ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు.