మోపాడు రిజర్వాయర్ అభివృద్ధి పనులకు పరిశీలన

మోపాడు రిజర్వాయర్ అభివృద్ధి పనులకు పరిశీలన

ప్రకాశం: పామూరు మండలంలోని మోపాడు రిజర్వాయర్‌ను MLA ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జైకా నిధులతో చేపడుతున్న మోపాడు రిజర్వాయర్ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించి, పనుల నాణ్యత, రిజర్వాయర్ పటిష్ఠతకు తీసుకోవలసిన చర్యలపై అధికారులకు ఎమ్మెల్యే దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.