చోరీలు అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు
MNCL: మందమర్రి పట్టణంలో దొంగతనాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. చోరీల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఆటో ద్వారా కాలనీల్లో విస్తృత ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంటికి తాళం వేసి వెళ్ళే సమయంలో లోపల లైట్లు వేసి ఉంచాలని, నమ్మకస్తులకు లేదా పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు.