స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం

కృష్ణా: తుళ్లూరులోని CRDA యూనిట్ ఆఫీస్ సమీపంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(NAC) శిక్షణ కేంద్రాన్ని నిర్మించనున్నారు. ప్రీ-ఇంజీనీర్డ్ బిల్డింగ్(PEB) తరహాలో నిర్మించనున్న ఈ భవన నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తూ విజయవాడ CRDA కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 16లోపు ఏపీ ఈ-ప్రొక్యూర్మెంట్ పోర్టల్ నుంచి ఆసక్తి గల సంస్థలు బిడ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.