పాఠశాలలను పర్యవేక్షించాలి: డీఈవో

పాఠశాలలను పర్యవేక్షించాలి: డీఈవో

SRD: రామచంద్రాపురం మండల కేంద్రంలోని సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ.. ప్రతి రోజు పాఠశాలలను పర్యవేక్షించి, నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపాలని, ఆన్‌లైన్ కు సంబంధించి ఆపార్, యుడైస్ తదితర పనులని పూర్తి చేయాలని మండల విద్యాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు పాల్గొన్నారు.