'30 ఎకరాల్లో మునిగిన వరిపంట'

జోగులాంబ గద్వాల: గద్వాల మండలంలోని బీరెల్లి గ్రామం వద్ద ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పెద్దయెత్తున వరిపంట సోమవారం నీట మునిగింది. నీలేశ్వర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, తదితర రైతులకు సంబంధించి సుమారు 30 ఎకరాల్లో వరిపంట నీట మునిగినట్లు ఆరోపిస్తున్నారు. పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.