రాజాం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా.. కొండ్రు మురళీమోహన్

శ్రీకాకుళం: రాజాం నియోజకవర్గం టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్‌ను టీడీపీ అధిస్థానం నియమించింది. ఈ మేరకు టీడీపీ నాయకులు కార్యకర్తలు రాజాంలో శనివారం సంబరాలు చేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధిస్తుందన్నారు. రాష్ట్రం మాదే రాజాం మాదేనని టీడీపీ నాయకులు వై. బాను జయప్రకాశ్, శ్రీనివాస్, గణపతి అన్నారు.