వృద్ధుడు అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు
ATP: గుత్తిలోని కర్ణం వీధిలో నివాసం ఉంటున్న సత్తార్ సాబ్(70) అనే వృద్ధుడు కనబడుట లేదని కుటుంబ సభ్యులు సోమవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు భాషా, జిలాన్ మాట్లాడుతూ.. ఉదయం బయటికి వెళ్లిన సత్తార్ సాబ్ తిరిగి ఇంటికి రాలేదని చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.