అనాధ మృతదేహానికి అంత్యక్రియలు

GNTR: అనాధ మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తూ ఆత్మ బంధువులుగా నిలుస్తున్నారు తెనాలికి చెందిన హెల్పింగ్ సోల్జర్స్ యువకులు. గత కొన్నేళ్లుగా అనేక అనాధ మృతదేహాలకు తమ చేతుల మీదుగా అంత్యక్రియలు చేసి మానవత్వం చాటుకుంటున్నారు. ఆదివారం బస్టాండ్ సమీపంలో ఒంటరిగా జీవిస్తున్న ఓ వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందగా ఆమెకు ఎవరూ లేకపోవడంతో ఈ యువకులే ముందుకు కదిలారు.