నూతన వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

నూతన వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

MBNR: రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని ఏఎంసీ వైస్ ఛైర్మన్ జవ్వాజి శేఖర్ గౌడ్ కోరారు. శుక్రవారం రాజాపూర్ మండల కేంద్రంలోని రైస్ మిల్లు వెనుక భాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.