విద్యార్థుల చదువుకు తోడుగా సైకిళ్లు పంపిణీ

విద్యార్థుల చదువుకు తోడుగా సైకిళ్లు పంపిణీ

NLG: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని చదువులో రాణించాలని అదనపు ఎస్పీ రమేశ్ అన్నారు. గురువారం నల్గొండలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వారం గ్రామానికి చెందిన ఆరుగురు పేద విద్యార్థులకు తీగల మోహన్ రావు ఆర్థిక సహకారంతో సైకిళ్లను అందజేశారు.