మదర్ థెరిసా ఎక్సెసన్స్ అవార్డు అందజేత
VZM: మాతృభూమి సేవా సంస్థ ద్వారా పలు గిరిజన గ్రామాల్లో చేసిన సేవలను గుర్తించి దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ మదర్ థెరీసా ఎక్సెసన్స్ అవార్డును గజపతినగరానికి చెందిన లెంక స్వామినాయుడుకు అందజేశారు. ఆదివారం రాత్రి విశాఖపట్నంలో నిర్వహించిన దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ వార్షికోత్సవ వేడుకల్లో నాయుడుకు పురస్కారాన్ని అందించారు.