కాలువలో పడ్డ గేదె.. బయటకు తీసిన సిబ్బంది

కాలువలో పడ్డ గేదె.. బయటకు తీసిన సిబ్బంది

KDP: బద్వేల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో మంగళవారం ఒక గేదె ప్రమాదవశాత్తు కాలువలో పడి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సహాయంతో కాలువలో పడిన గేదను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా లేక అధికారుల నిర్లక్ష్యమా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.