'పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి'

'పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి'

NRML: గాలికుంటు వ్యాధి నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత టీకాల కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తన ఛాంబర్‌లో బుధవారం ఆవిష్కరించారు. అక్టోబర్ 15 నుంచి నెల రోజులపాటు ప్రతి మండలంలో పశువులకు ఉచిత టీకాలు వేయనున్నట్టు తెలిపారు. పశు యజమానులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని వారు సూచించారు.