సకాలంలో పనులు పూర్తి చేయాలి: కలెక్టర్
MLG: గడువు లోపు మేడారం పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. సమ్మక్క, సారలమ్మ దేవాలయం ప్రాంగణం అభివృద్ధి పనులు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల రాతి నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 24వ తేదీలోపు దేవాలయ ప్రాంగణ పనులు పూర్తి చేయాలన్నారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు.