కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: కార్పొరేటర్

కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: కార్పొరేటర్

HYD: హరిహర పురం కాలనీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బీఎన్.రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని హరిహరపురం కాలనీ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఏర్పరచుకున్న సందర్భంగా శుక్రవారం నూతన కమిటీ సభ్యులు లచ్చిరెడ్డిని కలిసి తమ కాలనీలో సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. దీంతో ఆయన సమస్యలు పరిష్కరిస్తానన్నారు.