పూలుగూడలో ఉచిత దంత శిబిరం

పూలుగూడలో ఉచిత దంత శిబిరం

ASR: డుంబ్రిగూడ మండలంలోని పూలుగూడ ప్రాథమిక పాఠశాలలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉచిత మెగా దంత శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ఎంపీడీవో ప్రేమ్ సాగర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 200 మంది గిరిజనులు, చిన్నారులకు విశాఖ దంత నిపుణులు పలు పరీక్షలు చేసి, ఉచితంగా మందులను అందించారు. ఎంఈవో-2 గెన్ను తదితరులు పాల్గొన్నారు.