పాఠశాల భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే
MHBD: గత ఏడాది సెప్టెంబరులో కురిసిన భారీ వర్షానికి నెల్లికుదురు మండలం రావిరాల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల దెబ్బతింది. ఈ సందర్భంగా సోమవారం రూ.1.6 కోట్ల నిధులతో నూతన పాఠశాల భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మురళీ నాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.