పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటిన ఏసీపీ

పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటిన ఏసీపీ

KMM: మధిర రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వైరా ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చెట్లు నాటడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవచ్చని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రతిజ్ఞ చేశారు.